Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత వచ్చిన ఆర్య 2 అంతగా ఆకట్టుకోలేదు. అందులో కాజల్ అగర్వాల్, నవదీప్ నటించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రెండు సినిమాల్లోనూ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆర్య మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెకు ఆ సినిమాలో నటన ద్వారా మంచి మార్కులే పడ్డాయి. తరువాత కూడా పలు సినిమాల్లో ఆమె నటించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. అయితే అల్లు అర్జున్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె గురించి కీలక కామెంట్స్ చేశాడు.
ఆర్య సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఆర్య సినిమా తరువాత హీరోయిన్ అను మెహతాను మళ్లీ కలవలేదని తెలిపాడు. ఆర్య సినిమా తనకు ఎన్నో మంచి మెమొరీస్‌ని అందించిందని తెలిపాడు. ఇక ఆర్య మూవీ 2004 మే 7వ తేదీన రిలీజ్ కాగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ అంటే అమలాపురం పాట సూపర్ డూపర్ హిట్ అయి ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతోంది. ఇక అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 మూవీతో అలరించనున్నాడు. దీనికి సంబంధించిన లిరికల్ వీడియోను ఈమధ్యే రిలీజ్ చేయగా ఇందుకు మంచి స్పందన కూడా లభిస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌లాగే రెండో పార్ట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని తెలుస్తోంది. మరి మూవీ రిలీజ్ అయ్యాక స్పందన ఎలా ఉంటుందో చూడాలి.