Allu Arjun Children : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ లో బన్నీ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తోపాటు హీరోయిన్ రష్మిక మందన్న, అనసూయ, సునీల్‌తోపాటు మిగతా తారాగణం హాజరైంది. కానీ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాలేకపోయారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉన్న కారణంగా పాల్గొనలేకపోయారు. డైరెక్టర్లు ఎస్‌ఎస్ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతోపాటు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
The Super Cute #ThaggedheLe Moment ft. #AlluAyan & #AlluArha ♥
Watch #PushpaMASSivePreReleaseParty Live here ▶️ https://t.co/lQpHH9EbZN#PushpaTheRise#PushpaTheRiseOnDec17 🔥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP pic.twitter.com/8Vhn53UBwg
— Mythri Movie Makers (@MythriOfficial) December 12, 2021
ఈ ఈవెంట్‌లో బన్నీ పిల్లలు అయాన్, అర్హ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టేజ్‌పై వచ్చిన వారిని హోస్ట్ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్ ఇచ్చింది. వెంటనే ‘హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు. ఇక అర్హ మైక్ తీసుకుని నమస్తే.. అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. అయాన్, అర్హలు మొత్తానికి ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
https://www.instagram.com/p/CXaEko4l5qO/?utm_source=ig_embed&ig_rid=2dac2a4f-d71e-47f4-8047-468ab63050d7