Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సినిమాలలోకి రాకపోయిన కూడా హీరోయిన్స్ కి మంచిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలని షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా అల్లు అరవింద్.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కలర్ ఫోటో సినిమా ద్వారా ప్రధాన పాత్రలో వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలై మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా,అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సక్సెస్ మీట్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను ఇన్నేళ్లైనా ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం యంగ్ స్టర్స్. ఎందుకంటే ప్రతిరోజు నేను వారితో కలిసి ఏదో ఒక పని చేయడం వల్ల వారికి ఉన్న ఎనర్జీ నాకు వచ్చింది. మొదట ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను కొంత భయపడ్డాను . కానీ ఒకసారి ఈ సినిమా చూశాక రిలీజ్ చేయాలని భావించాను.ఇక ఈ సినిమా ప్రతి ఆడపిల్ల తన పేరెంట్స్ తో కలిసి చూడాల్సిన మంచి సినిమా. ఎందుకంటే మన సమాజంలో ఆడపిల్లలు అంటే వారిపై కొన్ని బాధ్యతలు ఉంటాయి.
బాగా చదవాలి కానీ పెళ్లయినాక ఉద్యోగం చేయకుండా ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో వాళ్లకి సేవ చేయాలి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఇలా వారి ఇష్టాలను తెలుసుకోకుండా ఇంట్లో ఒక బానిసలా చూస్తారు. అయితే ఆడపిల్లలందరని తల్లిదండ్రులు వారి గోల్స్ ఏంటో అడిగి తెలుసుకుని వారి లక్ష్యానికి చేర్చే దిశగా అడుగులు వేయనివ్వాలి. ఇక నా కోడలు స్నేహ రెడ్డి ఎంతో కోటీశ్వరుడి ఇంటి నుండి మా ఇంటికి కోడలుగా వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంది. అయితే స్నేహ రెడ్డి మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఏముంది. కానీ ఆమె ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా చూశాక నేను నా భార్య దగ్గరికి వెళ్లి అసలు నువ్వు పెళ్లి కాకముందు ఏమవ్వాలనుకున్నావు అని అడిగాను అంటూ అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు