నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెబుతోంది. స్టేట్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 పోస్టులు ఖాళీగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి అప్రెంటిస్ యాక్ట్1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2020 ఆగస్టు 31 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300ల పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ప్రతి నెల 15 వేల రూపాయలను స్టయిఫండ్ ఇవ్వనున్నారు. జులై 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 26 2021 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ. ఆగస్టు నెలలో ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ https://bank.sbi/web/careers వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…