Paytm Jobs: కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయిన వారికే కాదు.. ఔత్సాహికులకు కూడా ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం చక్కని అవకాశాన్ని అందిస్తోంది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు.. నెలకు రూ.35వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారికి అద్భుతమైన ఉద్యోగావకాశాలను అందిస్తోంది.
పేటీఎంలో దేశవ్యాప్తంగా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోనున్నారు. ఈ ఉద్యోగానికి 10వ తరగతి చదివి ఉంటే చాలు. ఇంటర్, డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. దీనికి గాను మొత్తం 20వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు.
పేటీఎం నియమించుకునే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగం పొందితే నెలకు రూ.35వేలు సంపాదించుకోవచ్చు. వేతనం + కమిషన్ కలిపి ఆ మొత్తం వస్తుంది. మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇక సొంత వాహనం ఉంటే ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగులు పేటీఎంకు చెందిన క్యూఆర్ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, రుణాలు, ఇన్సూరెన్స్‌లు వంటి ఫీచర్లపై వినియోగదారులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులకు వేతనంతోపాటు వారు చేసే ప్రదర్శనను బట్టి కమిషన్ కూడా లభిస్తుంది. ఇక మరిన్ని వివరాలకు https://paytm.com/fse అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…