ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనీ కోరుకునే అమ్మాయిలకు ఇది ఒక శుభవార్త.ఉమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 100 ఉద్యోగాలకు 10 పాసైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెల్గామ్, పూణె, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులకు మెయిల్ వస్తుంది. మీ అడ్మిట్ కార్డులో ఉన్న తేదీ రోజు మీరు ఈ ప్రాంతానికి చేరుకుంటే సరిపోతుంది.
మొత్తం ఖాళీగా ఉన్న 100 పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పని సరిగా పది ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు మధ్య ఉండాలి.ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://joinindianarmy.nic.in/
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…