ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన జడ్జిలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు,పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ద్వారా హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 25 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్ ఎగ్జామ్ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 21వ తేదీలోగా, దరఖాస్తును రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 చిరునామాకు పంపించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://hc.ap.nic.in/
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…