విశ్లేషణ

బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిన గాజు గ్లాసు గుర్తు..?

పంచాయ‌తీ, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ల‌భించిన జోష్‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో స‌త్తా చాటేందుకు ఓ వైపు వైకాపా రెడీ అవుతోంది. కానీ మరోవైపు బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు గాజు గ్లాసు గుర్తు నిద్ర ప‌ట్ట‌నీయ‌డం లేదు. గుర్తింపు పొందిన పార్టీగా జ‌న‌సేన మార‌లేదు. దీంతో ఆ పార్టీకి ఇంకా శాశ్వ‌త గుర్తు ల‌భించ‌లేదు. అయితే ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును తాజాగా తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఇంకో అభ్య‌ర్థికి ఎన్నిక‌ల సంఘం కేటాయించ‌డం ఆ రెండు పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారింది.

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ, జ‌న‌సేన పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి గెల‌వ‌డ‌మా, ఓడ‌డ‌మా అనే మాట అటుంచితే ఆ రెండు పార్టీల‌ను గాజు గ్లాసు గుర్తు ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. జ‌న‌సేన తాము ఆ స్థానంలో పోటీ చేస్తామ‌న్నా బీజేపీ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌మ అభ్య‌ర్థిని రంగంలోకి దించింది. అక్క‌డితో అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకుంటే తాజాగా గాజు గ్లాసు గుర్తు మొద‌టికే మోసం తెచ్చేట్లు క‌నిపిస్తోంది. బీజేపీ కాకుండా ఆ స్థానంలో జ‌న‌సేన అభ్య‌ర్థి ఉండి ఉంటే త‌మ పార్టీకే ఆ గుర్తును కేటాయించేవారు క‌దా ? అని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లోలోప‌ల బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఇప్పుడు ఆ గుర్తును ఇంకొక‌రికి కేటాయించారు క‌నుక దాన్ని తీసేయించ‌డం దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యమై బీజేపీ, జ‌న‌సేన‌లు ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. వారికి అనుకూలంగా వ‌స్తే ఓకే. లేదంటే ఉప ఎన్నిక‌లో ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM