పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తుంది. అయితే అత్తవారింటికి వెళ్ళిన ప్రతి అమ్మాయి కూడా భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంది. భార్యా భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. అత్తవారింట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని, పుట్టింటి వాళ్లు కూడా ఆనందంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటూ ఉంటుంది. మీరు కూడా అలానే కోరుకుంటున్నట్లయితే కొన్ని తప్పులు చేయకండి. అత్తవారింటికి వెళ్లే ప్రతి సారి కూడా అస్సలు ఈ తప్పులు చేయకూడదు. పుట్టింటికి వెళ్లడానికి కొన్ని నియమాలు ఉంటాయి. అలానే అత్తవారింటికి వెళ్లడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి.
పుట్టింటి నుండి అత్తవారింటికి ఈ వస్తువులను అస్సలు అమ్మాయి తీసుకు వెళ్లకూడదు. గుమ్మడికాయని అస్సలు పుట్టింటి నుండి అత్తవారింటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకోవాలి అనుకుంటే కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లే అమ్మాయి మిరపకాయలను కూడా తెచ్చుకోకూడదు. పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు. అంతేకాకుండా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు పదునైన వాటిని తీసుకువెళ్లకూడదు. చాకు, కొడవలి, బ్లేడ్లు ఇలాంటివి.
ఇటువంటివి తీసుకెళ్తే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు అగ్గిపెట్టె తెచ్చుకోకూడదు. అదేవిధంగా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఉప్పు, నూనె వంటివి తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి ఉప్పుని తెచ్చుకుంటే, పుట్టింటి వాళ్లకి అరిష్టం. నూనె తెచ్చుకుంటే అత్త వాళ్ళ ఇంటికి అరిష్టం. చీపురు కట్టలని కూడా అసలు పుట్టింటి నుండి అత్తవారింటికి తెచ్చుకోకూడదు.
రెండు కుటుంబాలు బాగుండాలి అనుకుంటే అద్దాన్ని కూడా తెచ్చుకోకూడదు. చూశారు కదా ఎటువంటి వస్తువులని తెచ్చుకుంటే ప్రమాదం, అరిష్టం అనేది. మరి ఈ తప్పుల్ని అస్సలు చేయకుండా చూసుకోండి. ఈసారి మీ పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఈ పొరపాట్లు మీకు తెలియక చేస్తున్నట్లయితే ఇక నుండి మానుకోవడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…