ఆధ్యాత్మికం

కురుక్షేత్ర యుద్ధం ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం మహాభారతం అనగానే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తారు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవులు వందమంది చనిపోతారు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం ఎక్కడ అనేది ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరగాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. ఈ విధంగా దృతరాష్ట్రుడు ఆ స్థలంలోనే యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అను ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఒక రాజు ఎంతో మంత్రముగ్ధుడై ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయాలని తన బంగారు రథం నుంచి అక్కడ అడుగు పెట్టాడు. రథం నుంచి దిగిన రాజు నాగలిని తయారుచేసి శివుడి వాహనం నందిని యముడి వాహనం మహిషాన్ని తీసుకొని నాగలితో యుద్ధం చేయసాగాడు.ఇది చూసిన విష్ణు మూర్తి అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడగగా అందుకు రాజు వ్యవసాయం చేస్తున్నాను అని సమాధానం చెబుతాడు.

ఈ క్రమంలోనే విత్తనాలు ఎక్కడ అని విష్ణుమూర్తి అడిగితే తన శరీరంలో ఉన్నాయని చెబుతాడు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఏది చూపించు అంటూ కురు అనే రాజు తన శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నప్పటికీ ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఉండటం వల్ల మంత్ర ముగ్ధుడైన విష్ణుమూర్తి తిరిగి తన శరీరాన్ని పూర్వ రూపానికి తెచ్చి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు రాజు ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఇక్కడ మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని వరం కోరగా అందుకు విష్ణుమూర్తి తథాస్తు అని వరమిచ్చాడు.

ఇక మహాభారతం విషయానికి వస్తే ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు యుద్ధం ఏ ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు. యుద్ధంలో తన కుమారులు ఎలాగో మరణిస్తారు కనుక వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని కురుక్షేత్ర యుద్ధం ఈ ప్రాంతంలో జరగాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా ఈ కురుక్షేత్ర భూమిలో మరణించిన కౌరవులకు మరణాంతరం స్వర్గప్రాప్తి కలిగిందని చెప్పవచ్చు.

Share
Sailaja N

Recent Posts

యాక్సెంచ‌ర్ కంపెనీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాల‌నుకునే వారి కోసం కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. గ‌తంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భ‌య‌ప‌డేవారు. కానీ…

Sunday, 5 January 2025, 6:20 PM

ఒరాకిల్ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఒరాకిల్ కంపెనీ ప‌లు…

Sunday, 5 January 2025, 11:58 AM

టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. డిగ్రీ పాస్ అయితే చాలు..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే టెక్ మ‌హీంద్రా కంపెనీ మీకు స‌ద‌వ‌కాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థ‌లో ఖాళీగా ఉన్న…

Sunday, 5 January 2025, 7:52 AM

యూకో బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.93వేలు..

యూకో బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి…

Friday, 3 January 2025, 10:18 PM

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభ‌వార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ…

Friday, 3 January 2025, 1:47 PM

మీ నోట్లో ఇలా ఉందా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. మ‌న…

Tuesday, 31 December 2024, 12:13 PM

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM