Beds : ప్రతి ఒక్కరు కూడా మంచం మీద నిద్రపోతూ ఉంటారు. మంచానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. అటువంటి నియమాలను కచ్చితంగా పాటించాలి. ఏ దిక్కున తలపెట్టి నిద్రపోవాలి..?, ఏ దిక్కులో మంచం పెట్టుకోవాలి..? ఇటువంటి విషయాలు అన్నింటినీ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అలానే ఇంట్లో ఎన్ని మంచాలు ఉండాలి.. అనే దానికి కూడా కారణం ఉంది.
చాలా మందిలో మూడు అనే సంఖ్యపై కొన్ని వ్యతిరేకమైన భావనలు ఉన్నాయి. మూడు ముడి పడదు అని అంటారు. మూడు కంచాలలో వడ్డించకూడదంటారు. అలానే మూడు దీపాలని వెలిగించకూడదంటారు. అలానే మూడు మంచాలు కూడా ఉండకూడదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఆ సందేహం మీకూ ఉంటే, ఇప్పుడే దానిని క్లియర్ చేసుకోండి. కేవలం ప్రయాణానికి మాత్రమే ఈ మూడు సంఖ్య గురించి చెప్పబడింది. కనుక శాస్త్రంలో మూడు అనే సంఖ్యకి ఎలాంటి నిషిద్ధము కూడా లేదు.
మూడు కంచాలలో భోజనం వడ్డించకూడదు. మూడు మంచాలు ఇంట్లో ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయమే. కానీ శాస్త్రపూర్వకంగా వర్తించదు. భార్య, భర్తలు ఎప్పుడు ఒకే మంచం మీద పడుకోవాలి. భర్త ఇంట్లో ఉండగా భార్య మరొక మంచం మీద కానీ కింద కానీ నిద్రపోకూడదు. ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా ఒకే మంచం మీద నిద్రపోవాలని శాస్త్రం చెప్తోంది.
మంచం మీద నిద్రించే ముందు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచం మీద అనవసరంగా ఎక్కి తొక్క కూడదు. మంచం మీద కూర్చుని తినకూడదు. మంచం మీద కూర్చుని తినడం వలన ఇంట్లో సంపద ఎక్కువ కాలం ఉండదు. మంచం మానవుడికి ప్రపంచంలో ఉన్న సమస్యల్ని, కష్టాలని, బాధల్ని అన్నీ మరిచిపోయి మనిషికి నిద్రని కలిగిస్తుంది. అందుకని మంచాన్ని దూషించకూడదని అంటుంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…