Trees : ఇల్లు.. చెట్టు.. అవినాభావ సంబంధం. మన జీవితమంతా ప్రకృతి, పంచభూతాత్మికం. మనకు అనేక చెట్లు ఉపయోగపడతాయి. అయితే వాటిలో కొన్ని ఇంట్లో ఉండవచ్చు. కొన్ని మాత్రం దూరంగా ఉండాలి. అవి చెడ్డవికావు, కానీ ఇంట్లో మాత్రం పనికిరావు. ఏయే చెట్లు మన ఇంట్లో ఉండకూడదో తెలుసుకుందాం. దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు, తుమ్మచెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతిని పెంచుతాయి.
ఇంటికి తూర్పు దిశలో ఎత్తైన చెట్లు ఉండకూడదు. ఇక అశుభాలను కలిగించే చెట్లు, ఇంటి చుట్టు పక్కల సగం కాలిన వస్తువులు, సగం ఎండిన వస్తువులు, పొడవాటి వృక్షాలు ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో సుఖ – సంతోషాలకు అవరోధాలుగా ఉంటాయి. కుటుంబంలో పిలల్ల సంతోషం వారి విజయంపై కూడా ప్రభావం చూపుతుంది. మానసిక అనారోగ్యం కూడా కలుగుతుంది. ఇక దుష్టశక్తులను ప్రేరేపించే చెట్లు పరిశీలిస్తే.. చింత, మర్రిలాంటి చెట్లను ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ నాటకూడదు. ఎందుకంటే వీటిపై దుష్టశక్తులు నివసిస్తాయని నమ్ముతారు.
వీటివెనుక అనేక కారణాలు ఉన్నాయి. పెద్దపెద్ద వృక్షాలను మన ఇండ్లలో పెంచుకుంటే వాటి వేర్లు ఇంట్లోకి పోయి గోడలు, పునాదులు కదులుతాయి. అంతేకాకుండా అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన పూర్వీకులు వాటిని పొలాలు, ఖాళీ ప్రదేశాలు, ఊరికి దూరంగా నాటేవారు. కనుక ఇలాంటి చెట్లను ఇంటి ఆవరణలో అసలు పెంచరాదు. ఔషధ సంబంధమైన మొక్కలను పెంచుకోవచ్చు. అలాగే అరటి, ఉసిరి, తులసి, కలబంద లాంటి మొక్కలను పెంచుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…