Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే..! భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం. చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి రాయిలోనూ, చెక్కలోనూ, ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి.. అలాంటప్పుడు దేవుళ్ల ఆలయాలు కొన్ని ఎత్తయిన కొండలపై ఎందుకు ఉంటాయి..? సాధారణ నేలపై ఎందుకు ఉండవు..? అంటే.. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్వతాలు, నదులు, వృక్షాలను పరోపకార పరాయణులు అంటారట. అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలా మంది రుషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని, తమపై వెలవాలని ఆయా దేవుళ్లను కోరుకున్నారట. దీని వల్లే భద్రగిరిపై రాముడు, యాదగిరిపై నరసింహుడు, సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి.. ఇలా ఆయా గిరుల (కొండల)పై ఆయా దేవుళ్లు, దేవతలు వెలిశారు. అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్లలోనే మహిమ ఉంటుంది, మిగతా వారిలో ఉండదని కాదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, ఆయన మనందరికీ ఆరాధ్య దైవమే.
కానీ.. ముందే చెప్పాం కదా.. మహాకవి వాల్మీకి చెప్పినట్టు పర్వతాలకు ఓ విశిష్ట స్థానం ఉంది కనుకే చాలా మంది దేవుళ్లు, దేవతలు రుషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెలిశారు. ఈ క్రమంలో ఆయా దేవుళ్లు, దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రయం ఇస్తాయి. సేద తీరేలా చేస్తాయి. ఆహారం అందిస్తాయి కూడా. అలా పర్వతాలు ఎంతో మంది భక్తుల పాదస్పర్శతో తరిస్తాయి. అయితే ఇదే కాదు.. దేవుళ్లు కొండలపై ఎక్కువగా వెలియడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. మనకు దైవమంటే ఎంత ఇష్టమో, ఎంత భక్తో తెలుసుకునేందుకు, ఎంత కష్టానికి ఓర్చి దైవాన్ని దర్శించగలం అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిశాడట. అందుకే అంత దూరంలో, అంత ఎత్తులో వెలసిన దేవున్ని చూసేందుకు వెళ్లినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు. ఓర్పుగా ఉండాలి. అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి.
అయితే దేవుళ్లు కొండలపై వెలియడానికి మరో కారణం ఏమిటంటే.. పూర్వం.. అంటే నాలుగో యుగంలో మొదటిదైన సత్య యుగం (కృత యుగం) ప్రారంభమైనప్పుడు దేవుళ్లు, దేవతలు కిందే ఉండేవారట. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగడం, అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలిశాడట. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట. అందుకే దేవుళ్లు, దేవతలు కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…