Cow : మనం ఆవుని పూజిస్తూ ఉంటాము. ఆవు ఎక్కడ కనిపించినా కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెడుతూ ఉంటాము. హిందూ సంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు తోకని, గంగడోలుని నిమురుతుంటాము. గోవు పొట్టకి, నుదుటికీ పసుపు, కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాము. ఇంటి ముందుకి ఆవు వస్తే, ఇంటి ఆడపడుచు వచ్చినట్లుగా భావిస్తాము. ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాము. అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపై పూజలు అందుకుంటుంది గోమాత. అయితే, గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోకనుండి ఒక వెంట్రుక తీసుకోవాలి.
ఎందుకంటే, అది ఎంతో శక్తివంతమైనది. ఆవు తోక నుండి వెంట్రుక తీసుకుని బొటనవేలికి చుట్టుకోవాలి. ఎక్కడైనా ఒంట్లో నొప్పులు కానీ ఏమైనా బాధ కానీ ఉన్నట్లయితే, ఆ వెంట్రుక కట్టిన వేలుతో గట్టిగా ఒత్తుకోవాలి. మూడు సార్లు మనం ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి వెంటనే తగ్గక పోతే, రెండు మూడు రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఏ నొప్పి అయినా సరే తగ్గిపోతుంది.
ఈ వెంట్రుకలలో ఎంతో గొప్ప ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని ని బయటికి పంపించి, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైనా మీరు ఏ స్వామీజీ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు. వాటికి ఆవు తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి.
ఈ వెంట్రుకల వలనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో తెలియని శక్తి వస్తుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే, ఆవుతోక లోని వెంట్రుకలని, కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే, దిష్టి అనేది తగలదు. గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట. అలానే, గోవు కొమ్ముల నుండి పాదాల దాకా దేవతలు, త్రిమూర్తులు ఉంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…