ఆధ్యాత్మికం

Srikalahasti Temple : శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..?

Srikalahasti Temple : తిరుమ‌ల తిరుప‌తిని ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వెళుతుంటారు. పాప‌నాశ‌నం.. కాణిపాకం.. చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకుంటారు. ఇక‌ చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకున్న త‌రువాత‌ మ‌రే దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌ద‌ని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. అస‌లు ఎందుకు అలా చేయాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌ర‌గా ద‌ర్శించుకోవాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు వెళ్ల‌కూడదు.. వెళితే ఏమ‌వుతుంది. నేరుగా ఇంటికే ఎందుకు వెళ్లాలి..? ఆ వివ‌రాల‌ను తెలుసుకుందాం.

పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల‌, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచ‌భూత లింగాలు వెలిశాయి. అందులో ఒక‌టే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్క‌డి గాలిని స్పర్శించిన త‌రువాత ఏ ఇతర దేవాల‌యాల‌కు వెళ్ల‌కూడ‌న‌దే ఆచారం. అందులో నిజం లేక‌పోలేదు. స‌ర్ప‌దోషం.. రాహుకేతువుల దోషం ఇక్క‌డికి వ‌చ్చాక పూర్తిగా న‌యమ‌వుతుంది. శ్రీ‌కాళ‌హ‌స్తిలోని సుబ్ర‌మ‌ణ్య స్వామి ద‌ర్శ‌నంతో స‌ర్ప‌దోషం తొల‌గుతుంది. ప్ర‌త్యేక పూజ‌లు చేసుకున్న త‌రువాత నేరుగా ఇంటికే చేరాల‌ని చెబుతారు ఇక్క‌డి పూజారులు. కార‌ణం దోష నివార‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌కాళ‌హ‌స్తిలో పాపాల‌ను వ‌దిలేసి ఇంటికి వెళ్ల‌డ‌మే.

Srikalahasti Temple

తిరిగి ఏ ఇత‌ర దేవాల‌యాల‌కు వెళ్లినా దోష నివార‌ణ ఉండ‌ద‌నేది అక్క‌డి పూజ‌రులు చెబుతున్నారు. గ్ర‌హ‌ణాలు.. శ‌ని బాధ‌లు.. ప‌ర‌మ‌శివుడికి ఉండ‌వ‌ని, మిగ‌తా అంద‌రు దేవుళ్ల‌కి శ‌ని ప్ర‌భావం.. గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఉంటాయ‌ని చెబుతున్నారు. దీనికి మ‌రోక ఆధారం.. చంద్ర‌గ్ర‌హణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాల‌యాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజ‌లు ప్రారంభిస్తారు. కానీ గ్ర‌హ‌ణ స‌మ‌యంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జ‌రుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్క‌డ ద‌ర్శ‌నం చేసుకున్నాక ఇక ఇత‌ర దైవం ద‌ర్శ‌నం అవ‌స‌రం లేద‌న్న‌ది పండితుల మాట‌. ఇవీ.. దాని వెనుక ఉన్న కార‌ణాలు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM