Sabarimala Prasadam : చాలామంది శబరిమల వెళుతూ ఉంటారు. అయ్యప్ప మాల దీక్ష చేస్తూ, 41 రోజులు దీక్ష పూర్తయ్యాక, ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా, అక్కడ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. ఒక డబ్బాలో నల్లగా ఉన్న ప్రసాదం ని వాళ్ళు తీసుకొస్తారు. దీనిని మీరు కూడా, చాలాసార్లు తినే ఉంటారు. అయితే, చాలా మందికి అయ్యప్ప స్వామి గురించి తెలుసు.
కానీ, ఈ ప్రసాదం గురించి చాలా విషయాలు తెలియదు. ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కి సంబంధించిన, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాము. చాలామందికి, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక, స్వాములు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. దీని పేరు అరవణి ప్రసాదం.
దీనిని బియ్యం, నెయ్యి, బెల్లం తో చేస్తారు. ఇది కేవలం రుచిగా ఉండడమే కాకుండా పోషక పదార్థాలతో కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం మంచిదే. చలికాలంలో అరవణి ప్రసాదం తినడం వలన, శరీరంలో వేడి కలుగుతుంది. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుండి వస్తాయి.
ప్రతి ఏటా కూడా ఈ దేవాలయాన్ని, కనీసం రెండు నుండి పది లక్షల మంది దర్శించుకుంటారు. భక్తుల కోసం ప్రతి ఏడాది కూడా, ఇక్కడ 80 లక్షల అరవణి ప్రసాదాన్ని తయారు చేస్తారు. తిరుమల తర్వాత ఎక్కువ మంది వెళ్లే దేవాలయం ఇది. అనేకమంది భక్తులు ప్రతి ఏటా కూడా శబరిమల అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. శబరిమల లోని ఈ ప్రసాదం, తిరుపతి లడ్డు తర్వాత పేరుపొందిన ప్రసాదం.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…