Navagraha : మన హిందూ ధర్మంలో జ్యోతిష్యానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. అత్యంత ప్రాధాన్యతమైనది జ్యోతిష్యం. వీటిలో నవగ్రహాల పాత్ర చాలా ముఖ్యమైనది. పుట్టినప్పుడు గ్రహ స్థితిని బట్టి, మనిషి యొక్క స్థితిగతులని చెబుతారు. దోషాలు ఉంటే పరిహారాలని తెలుసుకుని వాటికి తగ్గట్టుగా అనుసరించేవారు. గ్రహాలలో మొదటిది సూర్యుడు. రవి గ్రహ దోషం కనుక ఉంటే గోధుమపిండి, గోధుమ రొట్టె, కాషాయ వస్త్రాలని, రాగి, రాగి జావని, మిరియాలను దానం చేస్తే మంచిది. అదే చంద్రగ్రహ దోషం ఉంటే అన్నదానం, పాలు, నీళ్లు, బియ్యం, తెల్లని వస్త్రాలు, వెండి వస్తువులను దానం చేస్తే మంచిది.
అలానే వివాహానికి సంతానానికి ప్రధానమైన గ్రహం కుజుడు. కుజ దోషం ఉంటే కందిపప్పు, పచ్చి ఖర్జూరం, బెల్లం, వస్త్రాలు, మిరపకాయలు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వంటివి ఇస్తే మంచిది. శుక్రుడుతో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు ఇస్తే కూడా మంచిది. బుధ గ్రహ దోషం ఉంటే.. ఆకుపచ్చని వస్త్రాలు, పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, విద్యార్థులకు విద్యకి సంబంధించిన వస్తువులని, ఆవులకి పచ్చగడ్డి వంటి విధానం చేస్తే మంచిది.
అదే గురు గ్రహదోషం ఉంటే తీయటి పదార్థాలు, శనగలు, గుగ్గిళ్ళు, పండ్లు వంటివి ఇస్తే మంచిది. పసుపు రంగు వస్త్రాలని, తీయని పానీయాలని, బఠానీలని కూడా దానం చేయొచ్చు. శుక్ర గ్రహ దోషము ఉంటే స్త్రీలకి సంబంధించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, గోరింటాకు, గోళ్ళ రంగు, అద్దం, దువ్వెన, పౌడరు, పూలు, డ్రై ఫ్రూట్స్, రంగురంగుల దుస్తులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దానం చేయొచ్చు.
శని గ్రహ దోషము ఉంటే నువ్వులు నూనె, ఇనుము, నీలం బట్టలు, సిమెంట్ వంటివి దానం చేయొచ్చు. రాహు గ్రహ దోషము ఉంటే మినప సున్నుండలు, ఇడ్లీలు, మినప గారెలు వంటివి దానం చేస్తే మంచిది, కేతు గ్రహదోషము ఉంటే పక్షులకి, చేపలకి ఆహారం పెట్టడం.. పశువులకు ఆహారం పెట్టడం, ఉలవల పొడిని ఆవులకి పెట్టడం వంటివి చేస్తే మంచిది. ఇలా గ్రహ దోషాలను బట్టి, ఆచరించి దోషాల నుండి బయటపడొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…