Gomatha : హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవుకు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఆవును పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులో దేవతలు, దేవుళ్లు అందరూ నివాసం ఉంటారని హిందువులు నమ్ముతారు. గృహప్రవేశం, పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో కూడా ఆవుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆవును ప్రత్యేకంగా పూజించడం, పరిహారాలు వంటివి చేయడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే గోమాతను ప్రసన్నం ఎలా చేసుకోవాలి.. దాని కోసం మనం చేయాల్సిన పూజలు, పరిహారాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవుకు రొట్టెతో పాటు బెల్లం కూడా తినిపించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాచేయడం వల్ల జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మన పురోగతికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే ఆవు మెడ, వీపును పట్టుకుంటే ఆవు అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే రోజూ అన్నం తినే ముందు మొదటి ముద్దను ఆవుకు పెట్టడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే జాతకంలో బుధుడు అశుభంగా ఉన్నవారు రోజూ ఆవుకు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
అలాగే ఇంట్లో ఉండే పూజ గదిలో ఆవు బొమ్మను ఉంచాలి. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. పూజ గదిలో ఆవుబొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. రోజూ ఆవు బొమ్మను, ఆవును పూజించడం వల్ల పుణ్య లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా జాతక సమస్యలతో బాధపడే వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఆవును పూజించడం వల్ల, తగిన పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…