ఆధ్యాత్మికం

Mouli Daram : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

Mouli Daram : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా. అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌మ‌హావిష్ణువు అవ‌తారాల్లో ఒక‌టైన వామ‌నావ‌తారం గురించి తెలుసు క‌దా. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి వ‌ద్ద‌కు ఆయ‌న వ‌చ్చి వ‌రం కోరుకుంటాడు. మూడ‌డుగుల స్థలం కావాల‌ని అడగ్గానే వామ‌నుడు ఒక అడుగును భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు. ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు బ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న నెత్తిన పెట్ట‌మంటాడు. దీంతో వామ‌నుడు త‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు. దీంతో బ‌లి దాన గుణానికి మెచ్చిన‌ వామ‌నుడు బ‌లికి మృత్యుంజ‌యుడిగా ఉండేలా వ‌రం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని క‌డ‌తాడ‌ట‌. అందుక‌ని అప్ప‌టి నుంచి దాన్ని చేతుల‌కు క‌డుతూ వ‌స్తున్నారు.

Mouli Daram

అలా మౌళి దారం క‌డితే ఎవ‌రికైనా కీడు జ‌ర‌గ‌ద‌ట‌. మృత్యువు అంత త్వ‌ర‌గా స‌మీపించ‌ద‌ట‌. ఎక్కువ కాలం సుఖంగా బ‌తుకుతార‌ట‌. సాక్షాత్తూ బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రులు, వారి భార్య‌లైన స‌ర‌స్వ‌తి, ల‌క్ష్మి, పార్వ‌తిలు అండ‌గా ఉంటార‌ట‌. ఏ కష్టాల‌ను రానివ్వ‌ర‌ట‌. అందుక‌నే మౌళి దారాల‌ను క‌డ‌తారు. ఇదీ.. ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు న‌వ‌గ్ర‌హాల్లో మూడింటిని ప్ర‌తిబింబిస్తాయి. అవి బృహ‌స్ప‌తి, కుజుడు, సూర్యుడు. వీరు వ్య‌క్తుల ఐశ్వ‌ర్యానికి, సుఖానికి, విద్య‌కు, ఆరోగ్యానికి కార‌కుల‌ట‌. అందుక‌ని ఆ గ్ర‌హ పీడ ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఆ రంగుల‌తో ఉన్న మౌళి దారాన్ని క‌డ‌తారు. ఇక దీన్ని మ‌గ‌వారికి కుడి చేతికి క‌డ‌తారు. ఆడ‌వారికి ఎడ‌మ చేతికి క‌డ‌తారు. పెళ్లి కాని ఆడ‌వారైతే వారికి కూడా కుడి చేతికే క‌డ‌తారు.

Share
IDL Desk

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM