ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి వాళ్ళింట కొలువై ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లని కనుక ఎవరైనా చేసినట్లయితే, లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి, బిచ్చగాళ్ళని చేస్తుందట. మరి లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగించే విషయాలు ఏమిటి..?, ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
లక్ష్మీదేవి ఇటువంటి వారింట్లో అస్సలు కొలువై ఉండదు. ఇటువంటి వారి ఇంటి నుండి వచ్చేస్తుంది. అత్యాశ ఉన్న వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు. నిత్యజీవితంలోని ధర్మాలని నిర్లక్ష్యం చేస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉండకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అత్యాశ పనికిరాదు. అలానే ధర్మాలని పాటించే విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అహంకారం ఉంటే కూడా లక్ష్మీదేవి అక్కడ ఉండదు.
అహంకారం, అజ్ఞానంతో నిండిన వ్యక్తి వద్ద కానీ అహంకారం, అజ్ఞానంతో నిండిన ఇంట్లో కాని లక్ష్మీదేవి అసలు ఉండదు. అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతుంది. అలానే కర్మను మించి దురాశని కోరుకునే ప్రదేశంలో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలానే హింస జరిగే చోట కూడా లక్ష్మీదేవి ఉండదు. అహింస జరిగే చోటు కూడా ఉండదు. జంతువులని బాధ పెట్టడం, హింస చేయడం వంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదట.
మర్యాద లేకుండా స్త్రీ పట్ల ప్రవర్తించడం వంటివి చేస్తే కూడా లక్ష్మీదేవి ఉండదు. మహిళల మీద కోప్పడడం, మహిళలని హింసించడం వంటివి జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు. అయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవిని మెప్పించాలన్నా భార్య, భర్త ఎంతో ప్రేమగా అన్యోన్యంగా నివసిస్తూ ఉండాలి. అలానే అతిథుల్ని గౌరవించాలి. అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పండితుల్ని గౌరవించే కుటుంబంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…