Money Found On Road : మీరు దారిలో వెళ్తున్న ప్పుడు చాలా సార్లు రోడ్డుపై డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. డబ్బు, నాణేలు లేదా నోట్ల రూపంలో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ డబ్బును ఏమి చేయాలో తెలియక చాలా మంది మనసులో గందరగోళ పడుతుంటారు. కొందరు వాటిని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటారు. ఇంకొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బు తీసుకోవాలా వద్దా అనే ప్రశ్న సర్వ సాధారణంగా ఎవరికైనా సరే వస్తుంది. రోడ్డుపై పడి ఉన్న డబ్బులు తీసుకోవడం మంచిదేనా.. ఇందుకు పండితులు ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుందట. రోడ్డుపై పడి ఉన్న నాణేన్ని చూస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా పని పూర్తి శ్రమతో చేస్తే మీరు కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళ్తుండగా మార్గమధ్యంలో పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని అర్థమట.
మీరు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం. మీరు రోడ్డుపై ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ శాస్త్రం ప్రకారం దాన్ని ఖర్చు చేయకూడదు. దారిలో ఉన్న నాణేలను మీరు చూస్తే త్వరలో కొత్త పనిని ప్రారంభించవచ్చని అర్థం. ఈ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే దారిలో దొరికిన డబ్బులను ఖర్చు చేయకుండా దగ్గరే పెట్టుకోవాలి. లేదా దానం, విరాళం ఇవ్వాలి. ఇలా చేస్తేనే పైన చెప్పిన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…