ఆధ్యాత్మికం

Lord Kubera : ధ‌నానికి అధిప‌తిగా ఉన్న కుబేరుడు పూర్వ జ‌న్మ‌లో దొంగ అట తెలుసా..?

Lord Kubera : కుబేరుడు ధ‌నానికి, సంప‌ద‌కు, స‌కల ఐశ్య‌ర్యాల‌కు అధిప‌తి. ఆయ‌న్ను పూజిస్తే వాటిని ఇస్తాడ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అందుకే ల‌క్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్ర‌హాల‌ను, చిత్ర‌ప‌టాల‌ను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంత‌కు ముందు జ‌న్మ‌లో దొంగ అట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. శివ‌పురాణంలో దీని గురించి చెప్ప‌బ‌డింది. గ‌త జ‌న్మ‌లో దొంగ‌గా ఉన్న కుబేరుడు ఆ త‌రువాతి జ‌న్మ‌లో దేవుడిగా మార‌డం నిజంగా విచిత్ర‌మే. అందుకు గ‌ల అస‌లు కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుబేరుడు పూర్వ జ‌న్మ‌లో చాలా పేద వాడు. అత‌ని పేరు గున్నిధి. ఒకానొక ద‌శ‌లో తినేందుకు తిండి కూడా అత‌నికి ల‌భించదు. దీంతో అత‌ను దొంగ‌గా మార‌తాడు. అయితే ఓ సారి ఒక ప్ర‌దేశంలో ఉన్న శివాల‌యంలో పెద్ద ఎత్తున బంగారు న‌గలు, ర‌త్నాలు, ఇత‌ర ఆభ‌ర‌ణాలు ఉండ‌డాన్ని గున్నిధి చూస్తాడు. దీంతో వెంట‌నే ఆ న‌గ‌ల‌ను దొంగిలించాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలోనే అత‌ను ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌గానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆల‌యంలో శివ‌లింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది.

Lord Kubera

దీపం ఆరిపోవ‌డాన్ని గ‌మ‌నించిన గున్నిధి దాన్ని వెలిగించేందుకు య‌త్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెల‌గ‌దు. అలా అత‌ను చాలా సార్లు ప్ర‌య‌త్నిస్తాడు. ప్ర‌య‌త్నించిన‌ప్పుడ‌ల్లా విఫ‌ల‌మ‌వుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గున్నిధి త‌న చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గున్నిధి ఎదుట ప్ర‌త్య‌క్ష‌మై అత‌న్ని గ‌ణాల్లో ఒక అధిప‌తిగా చేస్తాడు. దీంతో అత‌ను త‌రువాతి జ‌న్మ నుంచి కుబేరుడిగా మారి సంప‌ద‌కు ర‌క్ష‌కుడిగా ఉంటాడు.

అయితే నిజానికి కుబేరుడి వ‌ద్ద ఉండే ధ‌నం ఆయ‌న‌ది కాదు, ఆయ‌న దానికి ర‌క్ష‌ణ మాత్ర‌మే క‌ల్పిస్తాడు. అందుకే చాలా వ‌ర‌కు ఆల‌యాల బ‌య‌టే కుబేరుని విగ్ర‌హాలు ఉంటాయి. కానీ లోప‌ల అవి ఉండ‌వు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ధ‌నానికి అధిప‌తి క‌నుక ఆయ‌న్ను పూజిస్తే ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తాడు. ఇక కుబేరుని క‌థ నుంచి మ‌నం తెలుసుకోవ‌ల్సింది ఏమిటంటే.. శివ లింగం ఎదుట ఎవ‌రైనా దీపం పెడితే వారి ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయ‌ట‌. ముఖ్యంగా ఆ ప‌నిని సాయంత్రం పూట చేయాల‌ట‌. అలా దీపం వెలిగించే క్ర‌మంలో ఓం న‌మ‌శ్శివాయ అనే మంత్రం జ‌పించాలి. దీంతో స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM