Lord Hanuman : చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు. హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు, ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి కూడా కలగవు.
హనుమంతుడు ఆకు పూజని బాగా ఇష్టపడతాడు. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యాన్ని కూడా చెబుతాడు. లంకా నగర వాసులకి భయాన్ని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయాన్ని హనుమంతుడు చెప్తాడు. సంతోషంతో రాముడు తమలపాకును తెంపి మాలాగా చేసి, ఆయన మెడలో వేస్తాడు. ఆయనని అభినందిస్తాడు.
అయితే లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి తోకతో తగలబెట్టి వస్తాడు. అందుకని ఆయన శరీరం వేడిగా ఉండడంతో, తాపాన్ని తగ్గించడం కోసమే రాముడు మెడలో తమలపాకు మాలని హనుమంతుడికి వేసినట్టు పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలా హనుమంతుడి మెడలో రాములవారు తమలపాకుల మాల వేయడం వలన హనుమంతుడు ఒక్కసారిగా ఆయన పడిన శ్రమనంతా కూడా మరిచిపోతాడు. ఎంతో సంతోషంతో ఉంటాడు.
ఇలా రాములవారు హనుమంతుడి మెడలో తమలపాకు మాలని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతాడు. కనుక ఆంజనేయస్వామిని సంతోషంగా ఉంచడానికి అప్పటి నుండి కూడా తమలపాకు మాలని వేయడం జరుగుతోంది. తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తాడు. తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్నవి జరుగుతాయని పండితులు అంటున్నారు. అందుకని ప్రత్యేకించి హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా తమలపాకులతో పూజించడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…