Lakshmi Devi : ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఉండి ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమీ లేదు. డబ్బు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే దయ, సేవాభావం, వినయం, వివేకం, శ్రమ ఉండాలి. అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనబడుతుంది. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అయితే విద్యాలక్ష్మి అంటే జ్ఞానం, వివేకం వంటి సద్గుణ సంపదగా చెప్పవచ్చు.
లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందని నారదుడు శ్రీమహావిష్ణువుని అడిగాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది వివరించాడు. అయితే లక్ష్మీదేవి ఈ సందర్భాలలో అలిగి వెళ్ళిపోతుందట. మంగళవారం నాడు అప్పు తీసుకోవడం మంచిది కాదు. ఆరోజు అప్పు తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుంది. కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం మంచిది కాదు.
బుధవారం నాడు అప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ పదే పదే మీరు బుధవారం నాడు అప్పు ఇస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. వంటగదిని ఎప్పుడూ ఈశాన్యంలో కట్టుకోకూడదు. అలా చేయడం వలన కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. పూజ గదిలో ఎంగిలి చేసినవి పెట్టకూడదు. తామర పువ్వులని ఎప్పుడు నలపకూడదు. అలానే నదులు, సరస్సులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అటువంటి వాటిలో మూత్ర విసర్జన చేయకూడదు. అలా చేయడం వలన కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎక్కడపడితే అక్కడ శుభ్రం చేస్తే కూడా లక్ష్మీదేవికి నచ్చదు. ఇంటి గోడలు, తలుపులు, గడపలని లక్ష్మీ స్వరూపంగా భావించాలి. గోడల మీద అవసరం లేనివి రాయడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే కాళ్ళని చాలా మంది ఒక పాదం మీద ఇంకో పాదం వేసి రుద్ది కడుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. చేతితోనే రుద్దుకోవాలి. అతిథి మర్యాదలకు ఎప్పుడూ లోపం చేయకూడదు. పశువులని అనవసరంగా కొట్టకూడదు, తిట్టకూడదు. ఇటువంటివి జరిగితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…