ఆధ్యాత్మికం

Katra Vaishno Devi : ఈ ఆల‌యానికి వెళితే చాలు.. ఎందులో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు..!

Katra Vaishno Devi : మ‌న దేశంలో ఉన్న ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌ల న‌డుమ ఉంటుంది. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. త‌మ కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే నిర్మించి ఉంటార‌ని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆల‌యంలో కొలువై ఉన్న దుర్గా దేవికి ఎంతో మ‌హిమ ఉంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు.

వైష్ణో దేవి ఆల‌యం ఏడాది పొడ‌వునా తెరిచే ఉంటుంది. అయితే మార్చి నుంచి అక్టోబ‌ర్ నెల‌ల న‌డుమ ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు ఉత్త‌మమైన స‌మయంగా చెప్ప‌వ‌చ్చు. వైష్ణోదేవి విగ్ర‌హం ఉన్న చోటుకి వెళ్లాలంటే గుహ‌ల్లో చాలా దూరం ప్ర‌యాణించాలి. అయితే ఆ దూరాన్ని త‌గ్గించేందుకు మ‌రో రెండు గుహ‌ల్లో అధికారులు దారుల‌ను ఏర్పాటు చేశారు. వైష్ణోదేవి ఆల‌యం ఉన్న కొండ స‌ముద్ర మ‌ట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ప్ర‌ధాన ఆల‌యం ఉన్న గుహ 30 మీటర్ల పొడ‌వు, 1.7 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది.

Katra Vaishno Devi

వైష్ణో దేవి ఆల‌యం ఉన్న గుహ‌లు కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే ఏర్ప‌డ్డాయ‌ట‌. అలాగే సుమారుగా 10 ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే ఈ ఆల‌యాన్ని నిర్మించార‌ని చెబుతారు. మ‌హాభార‌తంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచ‌న మేర‌కు పాండ‌వులు వైష్ణో దేవిని పూజించార‌ట‌. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచార‌ట‌. భైర‌వుడు అనే ఓ రాక్ష‌సున్ని సంహరించిన అనంత‌రం దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్క‌డ అవ‌త‌రించింద‌ని చెబుతారు. అలాగే ఆ రాక్ష‌సుడి త‌ల గుహ నుంచి లోయ‌లోకి ప‌డిపోయింద‌ని స్థ‌ల‌పురాణం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే రాక్ష‌సుని దేహం కూడా అక్క‌డే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహ‌లో ఇప్ప‌టికీ ఉంటుంద‌ని చెబుతారు. అందుకే ఆలయం స‌మీపంలో ఉన్న కొన్ని గుహ‌ల‌ను ఎప్పుడూ మూసే ఉంచుతారు.

వైష్ణో దేవి ఆల‌యానికి వెళ్లే దారిలో ఓ గుహ వ‌ద్ద నీరు వ‌స్తుంటుంది. అందులోనే భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచరించి దేవిని ద‌ర్శించుకుంటారు. వైష్ణో దేవి ఆల‌యానికి వెళ్లాలంటే కాట్రా అనే ప్రాంతం నుంచి వెళ్లాలి. కాట్రా ఒక చిన్న టౌన్‌. అక్క‌డే యాత్రికులు బ‌స చేస్తుంటారు. అక్క‌డ బ‌స చేసిన అనంత‌రం దైవ ద‌ర్శ‌నం చేసుకుని తిరిగి కాట్రాకు వ‌చ్చి అక్క‌డి నుంచి సొంత ఊళ్ల‌కు వెళ్తుంటారు. కాట్రాకు వెళ్లాలంటే విమాన‌, రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్ల‌వ‌చ్చు. విమానంలో అయితే జ‌మ్మూకు చేరుకుని అక్క‌డి నుంచి 42 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కాట్రాకు చేరుకోవాలి.

రోడ్డు మార్గంలో అయితే ఢిల్లీ, చండీగ‌డ్‌, డెహ్రాడూన్‌, పాటియాలా, అమృత‌స‌ర్‌, ధ‌ర్మ‌శాల‌, ప‌ఠాన్‌కోట్‌ల నుంచి నేరుగా కాట్రాకు వెళ్ల‌వ‌చ్చు. రైలు మార్గంలో అయితే కోల్‌క‌తా, ప‌ఠాన్ కోట్‌, అమృత‌స‌ర్‌, ఢిల్లీ, చండీగ‌డ్ నుంచి జ‌మ్ముతావి చేరుకోవాలి. ఇక కాట్రా నుంచి కొండ ప్రాంతంలో ఉండే వైష్ణో దేవి ఆల‌యానికి చేరుకోవాలంటే కాలి న‌డ‌క మార్గం, గుర్ర‌పు స్వారీ, ప‌ల్ల‌కి లేదా హెలికాప్ట‌ర్ స‌ర్వీస్‌ల‌లో దేన్న‌యినా ఉప‌యోగించుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM