Kameshwar Dham : హిందూ పురాణాల్లో మన్మథుడి గురించి తెలుసు కదా. అందమైన రూపం, చెరుకుగడ విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు. కానీ మన్మథుడు ఒకానొక సమయంలో శివుని మూడో కన్నుకు భస్మమవుతాడు. అయితే మన్మథుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..? కామేశ్వర్ ధామ్‌లో..! అవును, మీరు విన్నది కరెక్టే..! ఇంతకీ శివుడు మన్మథున్ని ఎందుకు భస్మం చేశాడో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాకుండా దేవ లోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు. చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. దీంతో తారకాసురున్ని ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కానీ ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే. పార్వతిని వివాహమాడలేదు. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, అతని తపస్సుకు భంగం కలిగించి, అతనిలో విరహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రున్ని కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మథున్ని పంపుతారు.
అప్పుడు మన్మథుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణం వేస్తాడు. దీంతో శివుడు ఆగ్రహించి మన్మథున్ని మూడో కన్నుతో భస్మం చేస్తాడు. ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో, నిజం తెలుసుకున్న శివుడు మన్మథున్ని మళ్లీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మథున్ని భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ ధామ్‌గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ ఆ ధామ్‌లో అలాగే ఉంది. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తుంది. కాగా ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా అనే ప్రాంతంలో ఉంది. కావాలంటే భక్తులు వెళ్లి ఆ చెట్టును, అక్కడి ఆలయాన్ని దర్శించి రావచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…