Kalasha Sthapana : చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఘటస్థాపనతో పాటు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల మొదటి రోజు చేసే కలశ స్థాపనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కలశ స్థాపనకు ఉపయోగించిన కొబ్బరికాయను నవరాత్రి చివరి రోజున తొలగించి భద్రంగా ఉంచుతారు. దీనిని శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ ధర్మాల ప్రకారం కొబ్బరికాయను శ్రీహరి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయ లేకుండా చేసే పూజ అసంపూర్ణమైనది. నవరాత్రుల్లో ఘటస్థాపన చేసే ఎవరైనా కొబ్బరికాయను ఉపయోగించాల్సిందే. అయితే కొన్నిసార్లు మనం కలశంలో ఉంచిన కొబ్బరికాయలో మొక్క పెరుగుతూ ఉంటుంది.
ఇలా మొక్క పెరిగే కొబ్బరికాయ మనకు దేనిని సూచిస్తుంది… ఇది మంచిదా..? కాదా..? ఇది ఎటువంటి ఫలితాలు కలిగిస్తుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో కలశంలో ఉంచిన కొబ్బరికాయలో చెట్టు పెరిగితే దీనిని శుభ సంకేతంగా పరిగణించాలి. అక్కడ ఉండే వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది. కొబ్బరికాయలో పెరిగే ఈ మొక్క మన ప్రగతిని సూచిస్తుంది. హిందూ ధర్మాల ప్రకారం విష్ణువు మరియు లక్ష్మీ దేవి కొబ్బరి చెట్టును భూమిపైకి తీసుకువచ్చారని నమ్ముతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. మనం పూజలో ఉపయోగించిన కొబ్బరికాయలో కనుక చెట్టు ఉంటే మనకు విష్ణువు యొక్క ఆశ్వీరాదం లభించిందని దాని అర్థం.
అలాగే లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయలో నివసిస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ప్రతిష్టించిన కొబ్బరికాయలో చెట్టు ఉంటే మనపై లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉన్నట్టే. అలాగే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడంతో పాటు ఆర్థికస్థితి కూడా మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…