Rama Koti : రాముడి పేరును అక్షరరూపంలో జపించడమే రామకోటి. మనసా వాచా కర్మేణ రాముడిని స్తుతిస్తూ ఆ మధురనామాన్ని కోటి సార్లు రాయడమే రామకోటి. శ్రీమన్నారాయణుడి అన్ని రూపాల్లో రామావతారమే చాలా ప్రాముఖ్యత పొందింది, రాముడిని ప్రతి ఒక్కరూ మా దేవుడు అనుకునేంతగా దగ్గరయ్యాడు. అతీత శక్తుల కంటే కూడానూ రాముడు చూపిన ఆదర్శవంతమైన జీవితమే చాలా మందిని రాముడు అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టాన్ని, భక్తిని ఏర్పరిచింది.
శ్లోకం..
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్.
తాత్పర్యం..
రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రుని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో వున్నది. ఆ శ్లోకాలలో ఉన్న ఏ ఒక్క అక్షరమైనా మనయొక్క మహాపాపాలను సైతం పరిహరిస్తుంది.
రామకోటిని రాయడానికి ఉపక్రమించే ముందు సాధారణంగా ఈ కింది నియమాలు పాటిస్తారు.
నిర్మలమైన మనస్సుతో రాయాలి. రాసేటప్పుడు దిక్కులు చూస్తూనో అనవసరమైన మాటలు మాట్లాడటమో చేయకూడదు. నేలపై పడుకుని రాయకూడదు. నల్లరంగులో రాయకూడదు. ఆకు పచ్చ రంగు పెన్ తో రాయడం చాలా మంచిది. పద్మాసనం వేసుకుని కూర్చుని రాయాలి. అంటు, మైల, పురుడు ఉన్న రోజులలో రాయకూడదు. రామకోటిని రాయడం పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి అదే నక్షత్రం రోజు ముగిస్తే మంచిది. పూర్తి చేసిన రోజు అన్న సంతర్పణ చేయడం మంచిది. సాయంకాలం స్నానం చేసి భోజనానికి ముందు రాయడం మంచి పద్ధతి.
సైంటిఫిక్ ఉపయోగాలు..
ఒకే పదాన్ని పలుమార్లు రాయడం వల్ల ఏకాగ్రతాశక్తి పెరుగుతూ ఉంటుంది. ఓపిక, సహనం లాంటి గుణాలు అలవడుతాయి. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల చేయాల్సిన పని సక్సెస్ అవుతుందన్న నమ్మకం వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…