మన దేశంలో అన్ని మతాలతో పాటు క్రైస్తవ మతం కూడా ఒకటి. క్రైస్తవ మతస్తులకు సంవత్సరంలో రెండు అతి ముఖ్యమైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఒకటి క్రిస్మస్ కాక, రెండవది గుడ్ ఫ్రైడే. క్రీస్తు జన్మదినాన్నికి గుర్తుగా క్రిస్మస్ జరుపుకుంటే, లోక రక్షణ కోసం క్రీస్తును కల్వరిగిరి పై సిలువ చేసిన రోజుగా గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. రెండువేల సంవత్సరాల క్రితం ఇదే రోజున ఏసుక్రీస్తును కల్వరిగిరి పై సిలువ చేయడంతో అప్పటి నుంచి క్రైస్తవ మతస్థులు ఈ రోజున గుడ్ ఫ్రైడే గా నిర్వహించుకుంటారు.
ప్రతి సంవత్సరం వసంతకాలంలో పౌర్ణమి తరువాత వచ్చే మొదటి శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే గా నిర్వహిస్తారు. ఈ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రైడే రోజు క్రైస్తవ మతస్తులు అందరూ పెద్ద ఎత్తున చర్చికి చేరుకొని ఏసుక్రీస్తు మోసిన సిలువను ప్రత్యేక ప్రార్థనలతో పూజించి ముద్దాడుతారు. ఆ రోజు సిలువ మోస్తు ఏసుప్రభు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడే ని జరుపుకుంటారు.
కొన్నిచోట్ల క్రైస్తవ మతస్తులు నల్లని దుస్తులను ధరించి, క్రీస్తును స్మరిస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏసుక్రీస్తుకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అందుకోసమే క్రైస్తవులు నల్లని వస్త్రాలను ధరిస్తారు.క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు ఆరోజు క్రీస్తుకు కలిగించిన బాధకు ప్రాయశ్చిత్తంగా నేడు గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకలలో భాగంగా క్రైస్తవులందరూ సామూహికంగా చేరి నిర్మలమైన మనసుతో ఆ ప్రభువును వేడుకోవటం వల్ల వారి జీవితమంతా సుఖసంతోషాలతో ఉంటుందని భావిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…