Durga Devi Saree : మహిళలందరూ అమ్మవారిని పూజిస్తారు. అమ్మ వారిని పూజించి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని, కోరిక నెరవేరాలని అనుకుంటారు. అమ్మవారు అనేక ప్రాంతాలలో వివిధ రూపాలు కలిగి ఉంటారు. అమ్మవారిని పూజించడానికి వెళ్లేటప్పుడు మహిళలు కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్టు వంటివి అమ్మ వారికి తీసుకు వెళ్లి సమర్పిస్తారు. అయితే ఆ చీరని పూజారుల చేతికి ఇచ్చి అమ్మ వారిని ఆ చీరతో అలంకరణ చేయమని, పూజారులకు చెప్తారు.
ఆ తర్వాత అమ్మ వారికి వేసిన చీరలు అన్నింటినీ కూడా వేలం వేస్తారు. అలా వేసిన అమ్మవారి చీరలని సాధారణ మహిళలు వేసుకోవచ్చా..? వేసుకోకూడదా..? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. అమ్మవారి చీరని ధరించ వచ్చా అని.. ఈ విషయం గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం అంటున్నాయనేది చూస్తే.. చీరలని అమ్మవారికి వేశాకా వాటిని ధరించవచ్చని చెప్తున్నాయి. కానీ వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి.
అమ్మవారి శేష వస్త్రాన్ని వేసుకునేటప్పుడు తిథి, వర్జ్యం చూసుకుని శుక్రవారం నాడు అమ్మవారి చీరని ధరించవచ్చు. అది కూడా ఉదయం పూట కొంత సేపు కట్టుకోవాలి. ఈ చీరని ధరించినప్పుడు ప్రశాంతత కలుగుతుంది. మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలు చక్కగా వస్తాయి. ఈ చీరని రాత్రిపూట మాత్రం అస్సలు కట్టుకోకూడదు. ఆ చీరని ఉతికినప్పుడల్లా నీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా మొక్కలకి పోసేయాలి.
ఇలా ఇటువంటి నియమాలని అమ్మ వారి చీరని కట్టుకునేటప్పుడు పాటించాలి. శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మ వారిని పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. మహిళలందరూ శుక్రవారం నాడు అమ్మ వారిని పూజించి అమ్మ వారి ఆశీస్సుల్ని పొందితే అనుకున్నవి పూర్తవుతాయి. కోరికలు నెరవేరుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…