Venkateshwara Swamy : ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. చాలా మంది అందుకే శనివారం పూజలు చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్, చక్కటి ఫలితం ఉంటుంది. శనివారం ఉదయాన్నే నిద్ర లేచి, శుచిగా స్నానం చేసి, తిరునామాన్ని నుదుటన పెట్టుకోవాలి.
పూజగదిలో వెంకటేశ్వర స్వామి ప్రతిమని కానీ విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటోను కానీ పెట్టుకోవాలి. దీపాలని శుభ్రం చేసుకుని పువ్వులతో స్వామి వారి పటాన్ని అలంకరించుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. తులసీ దళాలతో స్వామివారికి అర్చన చేయాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టుకోవాలి. పాలు, పండ్లు, చక్కెర పొంగలి, పులిహోర, కలకండ, పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలని వాయనం కింద ఇచ్చుకోవాలి.

ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పూజ చేస్తూ జపించాలి. సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి దీపాన్ని పెట్టుకోవాలి. చక్కెర పొంగలి, గారెలని నైవేద్యంగా పెట్టుకోవాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి. మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. స్వామి నామాలని పారాయణం చేయాలి. ఇలా ఈ విధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అష్టైశ్వర్యాలు కలగాలన్నా, లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలన్నా ఇలా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి.