ఆధ్యాత్మికం

Durga Devi : దుర్గాదేవిని ఈ 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది

Durga Devi : మనం ఏ పూజ చేయాలన్నా క‌చ్చితంగా పూలు మనకి ఉండాలి. ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి. రోజూ దేవుడికి పూజ చేయాలన్నా, పండగలప్పుడైనా సరే క‌చ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం. పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం. అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం. అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు ఈ పూలని పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు.

అయితే దుర్గాదేవిని మామూలు సమయంలో ఆరాధించేటప్పుడు ఈ పూలను పెట్ట‌వ‌చ్చు. అలాగే నవరాత్రి వేళల్లో కూడా ఈ పూలని పెట్టడం మంచిది. అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం. మందార పూలని అమ్మవారికి పెడితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మందారం పూలతో పూజించాలని పండితులు అంటున్నారు. మందార పూలతోపాటు ఆ దేవతకి నెయ్యిని కూడా అర్పించవచ్చు.

Durga Devi

అలాగే అమ్మవారికి చామంతి పూలు అంటే కూడా ఇష్టం. చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెర‌వేరుతాయి. నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి. అమ్మవారిని కమలం పూలతో పూజ చేస్తే కూడా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో మూడవ రోజు కమలం పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తే మంచిది.

మల్లెపూలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. నవరాత్రుల్లో నాలుగో రోజు మల్లెపూలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఐదవ రోజు పసుపు గులాబీలతో ఆరాధించాలి. ఆరవ రోజు బంతిపూలతో, ఏడవ రోజు కృష్ణ కమలంతో, ఎనిమిదవ రోజు బొండు మల్లె పూలతో పూజిస్తే మంచిది. తొమ్మిదవ రోజు సంపంగి పూలతో పూజ చేయాలి. అయితే నవరాత్రి సమయంలోనే కాకుండా మామూలు సమయంలోనూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ పూలని అమ్మవారికి పెట్టి ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. అంతా మంచే జరుగుతుంది. అనుకున్న‌వి నెర‌వేరుతాయి. ఐశ్వ‌ర్యం, కీర్తి ప్ర‌తిష్ట‌లు సిద్ధిస్తాయి.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM