Shivalayam : హిందువులు శివున్ని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. శివుని శివలింగం రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. అలాగే శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ. అయితే శివుడిని మాత్రం చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈవిభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు. మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. విభూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే శిలింగానికి కుంకుమబొట్టు పెట్టకూడదు. కేవలం విభూదిని మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి.
అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు. సోమవారం నాడు శివుడు కైలాసం నుండి నేరుగా భూమి పైకి వస్తాడని ప్రతిదీ. కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడంతో పాటు బెల్లం ముక్కను నైవేధ్యంగా సమర్పించాలి. సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. కనుక సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని ప్రతీతి. అలాగే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలతో మాత్రమే ఉపయోగించాలి. ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలా మంది పాలను ప్యాకెట్ లో ఉంచి అలాగే అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. పాలను గ్లాసులోకి తీసుకుని ఆ తరువాత అభిషేకం చేయాలి.
అలాగే అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఉపయోగించకూడదు. శివలింగంపై పాలు పోసిన తరువాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు స్టీల్ స్టాండ్ ను ఉపయోగించకూడదు. మన శరీరంపై ఉండే చెమట గానీ, వెంట్రుకలు గానీ శివుడిపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే జలదార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తెలుపు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు. ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోకూడదు. శివున్ని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్దన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పూలను శివునికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. శివుడికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పౌర్ణమి నాడు శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని శాస్త్రం చెబుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…