Pasupu Gavvalu : చిన్నతనంలో చాలా మంది అష్టాచెమ్మా, పచ్చీస్ వంటివి ఆడి ఉంటారు. ఇప్పటికీ పలు చోట్ల వీటిని ఆడుతూనే ఉంటారు. అయితే వీటిని ఆడేందుకు చాలా మంది గవ్వలను ఉపయోగిస్తారు. మొత్తం ఏడు గవ్వలను అందుకు వాడుతారు. అయితే వాస్తవానికి గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో పసుపు రంగు గవ్వలు కూడా ఒకటి. వీటికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో కింద చెప్పిన విధంగా పలు పరిహారాలను చేస్తే చాలు.. దాంతో ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయట పడతారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని గవ్వలను వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటల్లో ఉపయోగిస్తారు. అయితే పసుపు రంగు గవ్వలు మనకు ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడతాయి. వీటితో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగిపోతుంది. ఈ గవ్వలు కాస్త చిన్నగా ఉంటాయి. సులభంగా గుర్తు పట్టవచ్చు. లేత పసుపు రంగులో మనకు దర్శనమిస్తాయి. ఈ గవ్వలను పూజ మందిరంలో ఉంచి పూజలు చేయడం, ధూపదీపాలను సమర్పించడం చేస్తే జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎలాంటి పూజల్లో అయినా సరే ఈ పసుపు గవ్వలను ఉపయోగించవచ్చు. కానీ బేసి సంఖ్యలో ఉపయోగించాలి. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. కార్యసిద్ధి జరుగుతుంది. అన్నింటా విజయం సాధించారు. డబ్బు బాగా సంపాదిస్తారు. అలాగే 11 పసుపు రంగు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి శుక్రవారం రోజు పూజించి ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అప్పులు తీరిపోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇలా పసుపు రంగు గవ్వలతో మనం ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…