Lakshmi Devi : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే చాలినంత సంపాదన ఉండాలని కోరుకుంటాడు. దానికోసమే అందరూ పని చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఆర్థిక వనరులున్నా జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటారు. ఎంత సంపాదించినప్పటికి డబ్బును నిలుపుకోలేకపోతూ ఉంటారు. పైగా అప్పులు కూడా చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తే సమస్యల నుండి బయటపడడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం లభించాలంటే మనం ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే మనం మన అరచేతులను చూసుకోవాలి.
మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే అర చేతులను చూస్తూ కరాగ్రేవసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితగౌరి ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకాన్ని చదివి రెండు చేతులను కళ్లకు అద్దుకుని నిద్ర నుండి లేవాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షంతో పాటు అదృష్టం కూడా మన వెంటే ఉంటుంది. అలాగే నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. అలాగే తెల్లారి మెలుకువ వస్తుండగానే హరి హరి అంటూ 11 సార్లు జపిస్తూ అర చేతులు చూసుకోవాలి. నిద్ర లేచాక ఇష్టదైవాన్ని లేదా మీ పిల్లల ముఖాన్ని చూడవచ్చు. మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి అనించి తల్లి లాంటి నీ మీద కాళ్లతో నుడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతకి నమస్కారం చేయాలి. స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకు, పురుషులు సూర్యునికి నమస్కరించాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్య దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక తీరుతుందని పండితులు చెబుతున్నారు. ఉదయం తూర్పు దిక్కుకు తిరిగి దంతాలను శుభ్రం చేసుకోకూడదు. అలాగే స్త్రీలు రాత్రి గిన్నెలను, వంటగదిని శుభ్రం చేసుకున్న తరువాతే నిద్రించాలి. ఆహారం తీసుకునేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో ఈశాన్య దిశలో ఎటువంటి వస్తువులు ఉండకూడదు. ఈశాన్య దిశలో తరుచూ గంగాజలం చల్లుతూ ఉండాలి. ఇంటి ముందు బియ్యంపిండితో ముగ్గు వేయాలి. ఈ ముగ్గును చీమలు తినడం వల్ల అప్పులు తొలగిపోతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…