Vinayaka Chavithi : వినాయక చవితి పండుగ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. వాడ వాడలా గణనాథులు కొలువు దీరి 9 రోజుల పాటు భక్తులచే విశేష రీతిలో పూజలందుకుంటారు. తరువాత అంగరంగ వైభవంగా నిమజ్జనం నిర్వహిస్తారు. ఇలా ప్రతి ఏడాది ప్రజలు వినాయక చవతి వేడుకలను జరుపుకుంటుంటారు. ఇక ఈసారి సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య మంచి ముహుర్తం ఉందని పండితులు చెబుతున్నారు.
అయితే వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గణేషుడు భోజన ప్రియుడు కనుక ఆయనకు అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే గణేషుడికి పెట్టే పిండి వంటల విషయానికి వస్తే వాటిల్లో ఉండ్రాళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. తరువాత ఆయనకు మోదకాలను కూడా నైవేద్యంగా పెడుతుంటారు. ఈ రెండు పిండి వంటలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. కనుక భక్తులు వినాయక చవితి నాడు గణేషుడికి ఈ రెండు పిండి వంటలను నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే మనసులో బలంగా కోరుకోండి. దీంతో మీరు కోరిన కోరికలను ఆ బొజ్జ గణపయ్య నెరవేరుస్తాడు.
ఇక వినాయక చవితి నాడు చాలా మంది 21 రకాల పత్రాలను సేకరించి మరీ ఆయనకు పూజలు చేస్తుంటారు. ఇది టెక్ యుగం కనుక మనకు ఏది కావాలన్నా కూడా లభిస్తోంది. అయితే గణేషుడి పూజకు గాను మీకు 21 రకాల పత్రి లభించకపోతే మీరు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయనకు గరిక అంటే మహా ఇష్టం. కనుక గరికతో ఆయనను పూజిస్తే చాలు. ఇతర పత్రి లేదని బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలా వినాయకుడికి ఉండ్రాళ్లు, మోదకాలు చేసి పెట్టడంతోపాటు ఆయనకు రెండు గరిక పోచలను సమర్పించి భక్తితో వేడుకుంటే మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆయనను ఇలా పూజించడం మరిచిపోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…