ఆధ్యాత్మికం

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయరు.

ఎటువంటి పండగలు కూడా జరపరు. ఇంకొందరైతే ఏడాది మొత్తం దేవుడి గుడికి వెళ్ళరు. అలానే దేవుడి గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో పూజలు, శుభకార్యాలు కానీ పండగలు కానీ, దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం ఇవేమీ ఉండవు. అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానక్కర్లేదు. ఎందుకంటే దీపారాధన చెయ్యని ఇల్లు శ్మ‌శానంతో సమానం. ఎప్పుడూ కూడా దీపారాధన జరిగే చోటికి దేవుళ్ళు వస్తూ ఉంటారు.

అందుకే ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి. అప్పుడే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో, సౌభాగ్యాలతో ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే, దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులు పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేసుకోవడం పూజలు చేయడం వంటివి చేయకూడదు. 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి. తర్వాత 12వ రోజు నుండి శుభస్వీకారం జరుగుతుంది. 11 రోజుల తర్వాత కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడ‌వునా ఎక్కడికీ వెళ్ళకూడదని, గుడిలో పూజలు చేయకూడదని, ఇళ్ళల్లో పూజలు చేయకూడదని ఏమీ లేదు.

దీపారాధన చేసుకోవచ్చు. చెయ్యాలి. నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. దీప, ధూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని అలా వదిలేయడం, తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు. అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. దోషాలు కూడా తగులుతాయి. కాబట్టి కచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకండి. ఇంట్లో ఏడాది లోపే శుభకార్యాలు కూడా చేయాలని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM