Bell In Temple : హిందూ పూజా విధానంలో పూజ సమయంలో గంటకొట్టడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంట లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు. ఇల్లు అయినా, గుడి అయినా పూజ చేసేటప్పుడు గంట కొట్టాల్సిందే. అలాగే పూజ సమయంలోనే కాకుండా భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా గంట కొడతారు. ఇది మనందరికి తెలిసిందే. అయితే నైవేద్యం సమర్పించేటప్పుడు గంట ఎందుకు కొడతారు.. గంట కొట్టేటప్పుడు పాటించాల్సిన నియామాలు ఏమిటి.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, గాలి మూలకాలను మేల్కొల్పడానికి గంటనే మోగిస్తారు. గాలిలో వాయు, సమాన వాయు, అపాన వాయు, ఉదాన వాయు, ప్రాణ వాయు అనే 5 మూలకాలు ఉంటాయి. భగవంతునికి నైవేధ్యం సమర్పించేటప్పుడు 5 సార్లు గంట కొట్టడం వల్ల ఈ 5 మూలకాలు మేల్కొంటాయి. ఈ మూలకాల ద్వారా భగవంతుడు నైవేధ్యాన్ని స్వీకరిస్తాడని విశ్వసిస్తారు. అలాగే భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. నైవేద్యాన్ని ఎప్పుడూ తమలపాకులో ఉంచి దేవుడికి సమర్పించాలి. తమలపాకు దేవతలకు ఎంతో ప్రీతికరమైనది.
సముద్ర మథనం సమయంలో అమృతం చుక్క నుండి తమలపాకు ఉద్భవించిందని, అందుకే తమలపాకు దేవతలకు చాలా ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు. అలాగే భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు 5 సార్లు గంట కొట్టడంతో పాటు ఈ 5 మంత్రాలను కూడా చదవాలి. ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, అనే మంత్రాలను జపించిన తరువాత చేతిలోకి నీటిని తీసుకుని ప్రసాదం చుట్టూ తిప్పి, భూమిపై నీటిని వదలాలి. ఈ విధంగా భగవంతునికి నైవేద్యం సమర్పించాలని అప్పుడే మనకు పుణ్య ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…