మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను, జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేస్తాము. అయితే ఆవులను, గరుడ పక్షులను, నందీశ్వరుడిని ఇలా కొన్నింటిని దైవ సమానంగా భావించి భక్తి భావంతో పూజలు చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా గబ్బిలాలకు పూజలు చేయటం విన్నారా… వినడానికి వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రైల్వే కోడూరు మండలంలో,మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలనే దైవ సమానంగా భావించి పూజలు చేస్తున్నారు.ఇలా గబ్బిలాలకు పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మాధవరంపోడు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం పంటలు పండక ఎన్నో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఊరిలో గొడవలు, ముఠా కక్షలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలా గ్రామం మొత్తం కరువుకాటకాలు ఏర్పడిన నేపథ్యంలో ఊరి బయట ఉన్నటువంటి ఓ మర్రి చెట్టు పైకి వందలాది సంఖ్యలో గబ్బిలాలు వచ్చి చేరాయి. ఈ విధంగా గబ్బిలాలు వచ్చిన తర్వాత వారి గ్రామంలో ముఠా కక్షలు తగ్గి, వర్షాలు పడటంతో రైతులందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో కరవుకాటకాలు కూడా దూరం కావడంతో ప్రజలందరూ గబ్బిలాలు వచ్చిన తర్వాతే వారి గ్రామం అభివృద్ధి వైపు నడిచిందని భావించి ఆ గబ్బిలాలు నివసించే చెట్టుకు పూజ చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ గ్రామంలో గబ్బిలాలు ఉన్న చెట్టుకు పూజ చేయటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పక్షి దోషాలతో బాధపడుతుంటారు. అలాంటి వారిని ఈ చెట్టు దగ్గరకు తీసుకువచ్చి పూజలు చేసి వారికి గబ్బిలాల ఎముకలను తాయత్తుగా కట్టడంవల్ల పక్షి దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నపిల్లలను తీసుకుని ఈ చెట్టు వద్దకు వచ్చి పూజలు చేయటం విశేషం. ఈ గ్రామంలో వందలాది సంఖ్యలో గబ్బిలాలు ఉండగా ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ప్రమాదం కనిపించకపోవడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…