ఆధ్యాత్మికం

Ancestors In Dreams : చ‌నిపోయిన పెద్ద‌లు, పూర్వీకులు క‌ల‌లో క‌నిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా..?

Ancestors In Dreams : సాధార‌ణంగా ఎవ‌రికైనా చ‌నిపోయిన త‌మ పూర్వీకులు, పెద్ద వారు క‌ల‌లో క‌నిపించడం స‌హ‌జ‌మే. అయితే ఇలా వారు క‌ల‌లో క‌నిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్క‌రు ఒక్కో అర్థం చెబుతుంటారు. చ‌నిపోయిన వారికి క‌ర్మ‌లు స‌రిగ్గా చేయ‌లేదేమో, అందుకే వారు క‌ల‌లో క‌నిపిస్తున్నారు అని ఒక‌రంటారు. ఇంకొంద‌రైతే చ‌నిపోయిన వారికి మీరంటే బాగా ప్రేమ ఉందేమో, లేదంటే ద్వేషం ఉందేమో అందుకే త‌ర‌చూ క‌ల‌లోకి వ‌స్తున్నారు అని అంటారు. మ‌రికొంద‌రు ఇంకా వేరే ఏవో కార‌ణాలు చెబుతారు. అయితే మీకు తెలుసా.. చ‌నిపోయిన వారు అలా క‌ల‌లోకి రావ‌డం వెనుక వేరే అర్థాలు దాగి ఉన్నాయ‌ని. అవును, మేం చెబుతోంది నిజ‌మే. మ‌రి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?

హిందూ సాంప్ర‌దాయంలో ఒక్కో వ‌ర్గం వారు తమ ఆచార వ్య‌వ‌హారాల‌కు అనుగుణంగా చ‌నిపోయిన వ్య‌క్తుల‌కు 15 రోజుల లోపు క‌ర్మ కాండ‌లు పూర్తి చేస్తారు. అంతేకాదు నెల‌కోసారి మాసికం, ఏడాదికోసారి సంవ‌త్స‌రీకం చేసి చ‌నిపోయిన వారిని త‌ల‌చుకుంటూ క‌ర్మ‌లు చేస్తే దాంతో వారి ఆశీస్సులే కాదు, చ‌నిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా స‌ద‌రు కుటుంబాల‌కు క‌లుగుతాయ‌ట‌. అగ్ని పురాణం, గ‌రుడ పురాణం, వాయు పురాణంల‌లో దీని గురించి రాసి ఉంది. ఈ క్ర‌మంలో అలా క‌ర్మ‌లు చేసే కుటుంబాల‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ట.

Ancestors In Dreams

ఎవ‌రైనా వ్య‌క్తులు ఏదైనా యాక్సిడెంట్‌లోనో, లేదంటే ప్ర‌కృతి విప‌త్తులోనో మృతి చెంద‌కుండా స‌హ‌జ సిద్ధంగా మ‌ర‌ణిస్తే అలాంటి వ్య‌క్తుల కుటుంబాల‌కు చ‌నిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మెండుగా ఉంటాయ‌ట‌.
ఎవ‌రికైనా క‌ల‌లో పాములు క‌న‌బ‌డితే చ‌నిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు వారికి బ‌లంగా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. అంతే కాదు ఆ పూర్వీకులు కూడా ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్న‌ట్టు బ‌తికి ఉన్న‌వారు అనుకోవాలి. క‌ర్మ‌లు చేసే స‌మ‌యంలో ఎవ‌రికైనా అనుకోకుండా ధ‌నం క‌ల‌సి వ‌చ్చినా, ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న కార్యాలు నెర‌వేరినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అదంతా చ‌నిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సుల వ‌ల్లే అని అర్థం చేసుకోవాలి.

చ‌నిపోయిన వారు క‌ల‌లో ఆనందంగా ఉన్న‌ట్టు, ఆశీర్వ‌దిస్తున్న‌ట్టు క‌నిపిస్తే అప్పుడు ఆ క‌ల‌లు వ‌చ్చిన వారికి అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. ఎవ‌రైనా వ్య‌క్తులు ఏదైనా కార్యం చేయాల‌నుకున్న‌ప్పుడు అనుకోకుండా ఎవ‌రైనా పెద్ద‌వారు తోడ్పాటునందిస్తే అప్పుడు వారు చ‌నిపోయిన త‌మ పూర్వీకుల ఆశీస్సుల వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని తెలుసుకోవాలి. త‌ల్లిదండ్రులు, తోడ బుట్టిన వారితో స‌రిగ్గా మెలుగుతూ వారిని బాగా చూసుకుంటున్న వారికి కూడా చ‌నిపోయిన పెద్ద‌ల ఆశీస్సులు పుష్క‌లంగా ల‌భిస్తాయ‌ట‌.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM