Amarnath Yatra 2024 : మీరు అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్నారా… అయితే ఇది మీకు గొప్ప అవకాశం రానే వచ్చింది. అమర్ నాథ్ గుహలో మంచు శివలింగాన్ని చూడడానికి భక్తుల నిరీక్షణ ముగిసిందనే చెప్పవచ్చు. అమర్ నాథ్ యాత్ర కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఏప్రిల్ 15, 2024 నుండి ప్రారంభమైంది. ఇక అమర్ నాథ్ యాత్రను జూన్ 29 2024 నుండి ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. జూన్ 29 నుండి ప్రారంభమయ్యి ఈ యాత్ర ఆగస్టు 10 న ముగియనుంది. శ్రీ అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు తన వెబ్ సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే అమర్ నాథ్ యాత్ర 2024 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి 150 రూ. గా నిర్ణయించబడింది. అమర్ నాథ్ యాత్ర కోసం రిజిస్టేషన్ ఫీజులను వెబ్ సైట్ లో పేర్కొన్న బ్యాంక్ శాఖల ద్వారా చెల్లించవచ్చు.
మీరు అమర్ నాథ్ దర్శనం చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ jksasb.nic.in లో నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమర్ నాథ్ బోర్డు మొబైల్ ఆప్లికేషన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఆరోగ్య ధృవీకరణ పత్రం చాలా అవసరం. ప్రభుత్వ అధికారిక వైద్యుడు జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రం లేకుండా ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే దేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎస్ బ్యాంక్ లకు చెందిన 540 బ్రాంచ్ లలో యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఇందుకోసం దరఖాస్తుదారుడి ఫోటో, రిజిస్ట్రేషన్ ఫీజు, గ్రూప్ లీడర్ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ తో పాటు చిరునామాను ఇవ్వాలి. అలాగే పోస్టల్ చార్జీలు 1 నుండి 5 గురు భక్తులకు రూ.50, 6 నుండి 10 వరకు రూ100, 11 నుండి 15 మంది భక్తులకు రూ. 150, 16 నుండి 20 వరకు రూ.200, 21 నుండి 25 వరకు రూ. 250, 26 నుండి 30 వరకు రూ. 300 ఖర్చు అవుతుంది.
అలాగే ఏప్రిల్ 8 తరువాత తీసుకోబడిన ఆరోగ్య ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబడి అవుతుంది. ఇక యాత్రకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్ సైట్ లో యాత్రకు సంబంధించిన విషయాలు అన్ని చదివి ఆ తరువాత దరఖాస్తు చేసుకోవాలి. ఈ యాత్రకు 13 సంవత్సరాల నుండి 70 ఏళ్ల లోపు వారికి మాత్రమే అనుమతి ఉంది. అంతేకాకుండా ఈ యాత్రకు 6 వారాల కంటే ఎక్కువ ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా నమోదు చేసుకోలేరు. ఇక యాత్రకు వెళ్లలేని వారు యాత్ర ప్రారంభమైన తరువాత ఉదయం మరియు సాయంత్రం హారతిని ప్రత్యక్ష్య ప్రసారం చేస్తారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్ సైట్ మరియు ఆప్ లో దీనిని చూడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…