Lord Ganesha : ఏ పూజ చేయాలన్నా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ దేవుడినైనా పూజిస్తాం. వినాయకుడిని మొట్టమొదట పూజించడం వలన మనం తలపెట్టే ఏ కార్యమైనా కూడా పూర్తి అవుతుందని మన నమ్మకం. అందుకే తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి అవరోధాలు రాకుండా పని పూర్తి అవ్వాలని ప్రతిసారి తొలి పూజని వినాయకుడికి చేస్తారు. వినాయకుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం.
తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని మనం వినాయకుడి నుండి తెలుసుకోవచ్చు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని ఎవరైతే మొదట చుట్టి వస్తారో వాళ్లే గణాధిపతి అని అంటారు. నెమలి మీద కుమారస్వామి బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులను దేవుళ్ళుగా భావించి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా గణాధిపతి అయిపోతాడు.
విధి నిర్వహణయే ముందు.. అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. పార్వతీ దేవి పిండి బొమ్మను చేసి కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది. అయితే శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే వినాయకుడు అడ్డుకుంటాడు. ఇలా మనం విధినిర్వహణే ముందు అని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. ఆత్మ గౌరవమే ముఖ్యమని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. వినాయకుడి ఆకారం నచ్చకపోవడంతో స్వర్గలోకానికి వినాయకుడిని కాపలా పెట్టి అందరూ వెళ్తారు. వినాయకుడు దేవతలకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఒక రోజు ఎలుకల సహాయంతో దేవతలు వెళ్లే దారంతా తవ్వించేస్తాడు. ఆఖరికి దేవతలు వచ్చి వినాయకుడికి క్షమాపణలు చెప్తారు.
వినాయకుడు కనీసం మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, నిరంతరాయంగా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగానే రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయాలి అని మనం నేర్చుకోవచ్చు. అలానే ఓ నాడు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడు. చంద్రుణ్ణి ఆకాశం నుండి పూర్తిగా కనబడకుండా వెళ్ళిపోమని శాపం పెడతాడు వినాయకుడు. ఆ శాపాన్ని మళ్లీ మారుస్తాడు వినాయకుడు. అంటే దీన్ని బట్టి తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…