కొన్నిసార్లు ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందరితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఒక్కసారిగా మడుగులో గల్లంతయ్యే పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో నలుగురు గల్లంతయ్యారు. ఆ నలుగురు బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
విహార యాత్రల కోసం బెంగళూరు నుంచి 10 మంది చిత్తూరులోనే వాల్మీకిపురం అని గ్రామంలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నారు. అక్కడ మరో పది మందితో కలిసి వీరందరూ సరదాగా వెలిగల్లు ప్రాజెక్టుకి వెళ్లారు. ప్రాజెక్టు వద్ద అందరూ కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే అందరూ ఆడుకుంటూ దిగువన ఉన్న గండి మడుగులోకి సరదాగా ఈతకు వెళ్లారు.
అందరూ కలిసి ఎంతో సరదాగా ఈత కొడుతున్న సమయంలో వారిలో నలుగురు సభ్యులు మడుగులో గల్లంతైపోయారు. గల్లంతయిన వారు మహ్మద్ హఫీజ్(10), ఉస్మాన్ ఖానమ్(12), తాజ్ మహమద్(40), మహ్మద్ హంజా(12) గా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…