కరోనా ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీని వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి పోయాయి. దీంతో అనేక మంది తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాగే ఆ కుటుంబం కూడా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ శివారు ప్రాంతంలో ఉన్న సహారా ఎస్టేట్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న రవి థాకరే (56), రంజన (50)లు దంపతులు. వారికి టీనేజ్ వయస్సు ఉన్న ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రవి థాకరేకు కోవిడ్ కారణంగా జాబ్ పోయింది. గత 3 నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ లభించడం లేదు. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారం కష్టమైంది. కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని భావించారు.
శుక్రవారం ఇంట్లో తమ కుమారుడు, కుమార్తెలను ముందుగా వారు హత్య చేశారు. టైల్ కట్టర్‌తో వారి గొంతులను కోశారు. తరువాత ఆ దంపతులు విషం తాగారు. అయితే వారి కుమారుడు రితేష్ (16) వెంటనే చనిపోయాడు. తరువాత రవి మరణించాడు. ఈ క్రమంలోనే ఇరుగు పొరుగు వారు ఈ విషయం తెలుసుకుని వెంటనే రంజనతోపాటు వారి కుమార్తె గుంజన్ (14)ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…