ముంబైకి చెందిన ఓ యువతి చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలనే తీసింది. టూత్ పేస్ట్ అనుకుని ఆమె ఎలుకల విషంతో దంతాలను తోముకుంది. తరువాత హాస్పిటల్‌లో చేరి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ధారవికి చెందిన 18 ఏళ్ల అఫ్సానా ఖాన్ అనే యువతి సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం యథావిధిగానే నిద్రలేచి దంతాలను తోముకుంది. అయితే అంతకు ముందు టూత్ పేస్ట్ వద్ద ఎలుకల విషాన్ని ఎవరో ఉంచారు. ఆ విషయాన్ని గమనించని ఆమె టూత్ పేస్ట్‌కు బదులుగా ఎలుకల విషంతో దంతాలను తోముకుంది.
తరువాత కొంత సేపటికి తల తిరిగినట్లు అనిపించి, కడుపులో నొప్పిగా ఉండడంతో ఎందుకో ఆమె టూత్‌పేస్ట్‌ను చెక్ చేస్తే అది ఎలుకల విషం అని తేలింది. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించారు. కానీ ఎక్కడా ఆమెకు మెరుగైన వైద్యం లభించలేదు.
చివరకు ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా ఆమెను సెప్టెంబర్ 12వ తేదీన సర్ జేజే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…