సాధారణంగా మనం పాముకాటుకు గురైతే వెంటనే ఆ పామును చంపి దానిని ఆస్పత్రికి తీసుకువెళ్లి సరైన చికిత్స తీసుకుంటాము. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు పాము కరిచిందన్న కోపంతో ఆ పామును వెంటాడి వేటాడి దానిని నోటితో కసకస కొరికి చంపేశాడు. అయితే పామును అయితే చంపాడు కానీ ఆ వ్యక్తి కూడా ప్రాణాలను కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాధోపూర్ గ్రామానికి చెందిన 65ఏళ్ల రామా మహతోని అనే వ్యక్తి శనివారం రాత్రి పాముకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలోనే పాము పై ఎంతో కోపంతో దానిని వెంటాడి కసకసా నమిలాడు.మహతో చేస్తున్న ఈ పనిని చూసిన కొందరు గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యానికి లోనై అతనిని వారించారు. అయితే గ్రామస్తుల మాటలను పెడచెవిన పెట్టిన మహతో ఆ పామును కసితీరా కొరికి తన ఇంటి పక్కనే ఉన్న చెట్టుపై వేలాడదీశాడు. పామును చంపేశాను కనుక నాకేం కాదు అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోయి ఉండగా తెల్లవారుజామున మహతో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…