ప్రస్తుత కాలంలో చాలా మంది బతుకుతెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగానే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్‌లో భార్యాభర్తలిద్దరూ పనులు చేస్తూ ఉండగా తన పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్లే వారు. ఈ విధంగా పిల్లలను వదిలి పనికి వెళ్లి వచ్చేసరికి తన 2 సంవత్సరాల కొడుకు మృత్యువాత పడటం చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..
ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రదీప్‌రావుకు భార్య దుర్గావతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రావు హైదరాబాద్ కి వలస వచ్చి కుత్బుల్లాపూర్ బీహెచ్‌ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తన భార్య దుర్గావతి కొందరి ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే పిల్లలను ఆడుకొమ్మనిచెప్పి ఇంటి పనులకు వెళ్లిన దుర్గావతి తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.
తన రెండు సంవత్సరాల కుమారుడు బాత్రూం బకెట్లో పడి ఉండటం చూసి ఆ తల్లి వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలోనే తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…