సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునే మున్సిపల్ సిబ్బంది సంరక్షణ కేంద్రాల్లో విడిచి పెడతారు. లేదా కెన్నల్స్‌లో పెట్టి దత్తత తీసుకునే వారికి అందజేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్కలను చంపేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం పంచాయతీకి చెందిన అధికారులు 300 కుక్కలకు విషం పెట్టి చంపారు. విషపు ఇంజెక్షన్లను ఇచ్చి వాటిని బలి తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని కనీసం పూడ్చకుండా గొయ్యిలో పడేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
మూగజీవాల పట్ల అంతలా పాశవికతను ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. కుక్కలను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని, అందుకనే చంపేశామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…