సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ టాలీవుడ్ ,బాలీవుడ్ ఇండస్ట్రీలలో క్రేజ్ ఉన్న సమయంలోనే ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్అప్ చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన “క్రాక్” మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలు,కెరీరకు సంబంధించిన విషయాలతో పాటు హాట్ ఫోటోలతో నెటిజన్లుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అందులో ఒక అభిమాని శ్రుతీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే కుదరదు అని చెప్పింది. అలాగే మరో అభిమాని మీ మొబైల్ నంబరు ఇస్తారా..? అని అడగ్గా శ్రుతి ఆహా! నా నంబరు కావాలా అంటూ కుదరదు అని సరదాగా చెప్పేశారు. దీంతో ఆ ఇద్దరీ అభిమానులను నిరాశపరిచింది శ్రుతీ.
శృతిహాసన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ హిట్ మూవీ “వకీల్ సాబ్” మూవీలో గెస్ట్ రోల్లో కనిపించింది. అలాగే “పిట్టకథలు ” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…