నటిగా సాయిపల్లవి ఎంతటి పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్‌కు కూడా చాలా మంది ఇప్పటికే ఫిదా అయ్యారు. ఇక శేఖర్ కమ్ముల తాజా చిత్రం లవ్‌స్టోరీలోని సారంగ దరియా.. అనే పాటలో సాయిపల్లవి మరోమారు తన డ్యాన్స్‌తో అలరించింది. ఈ పాటకు చెందిన లిరికల్ వీడియోను ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయగా.. ఆ పాట మరో రికార్డును సృష్టించింది.
సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, శేఖర్ కమ్ముల దర్శకత్వం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఈ పాటను రూపొందించారు. దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పాట విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వీక్షణలను దక్కించుకుని రికార్డు సృష్టించింది.
అయితే ఈ పాటకు తరువాత తక్కువ వ్యవధిలోనే 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా 30 కోట్ల వ్యూస్ మార్కును ఈ పాట దాటింది. దక్షిణాదిలో ఇప్పటి వరకు మరే లిరికల్ వీడియోకు కూడా ఇలాంటి స్థాయిలో స్పందన రాలేదు. వ్యూస్ లభించలేదు.
ఇక కోవిడ్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవిలు నటిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేయాల్సి ఉంది. మరోవైపు దీన్ని ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…